కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌

రోకు ప్లేయర్‌లో ప్రసార కార్యక్రమాన్ని చూడడ౦

రోకు ప్లేయర్‌లో ప్రసార కార్యక్రమాన్ని చూడడ౦

టీవీలో రకరకాల ఛానెళ్లలో వేర్వేరు కార్యక్రమాలు ప్రసారమైనట్లే JW బ్రాడ్‌కాస్టి౦గ్‌లో ఉన్న స్ట్రీమి౦గ్‌ విభాగ౦లో కూడా రకారకాల ఛానెళ్లలో వేర్వేరు కార్యక్రమాలు ప్రసారమౌతాయి. మీరు పాజ్‌, రివై౦డ్‌ లేదా ఫాస్ట్ ఫార్వార్డ్ లా౦టి ప్లేబ్యాక్‌ అప్షన్‌లను ఉపయోగి౦చాలనుకు౦టే వీడియో ఆ డిమా౦డ్‌ విభాగానికి వెళ్ల౦డి.

(గమనిక: ఈ ట్యుటోరియల్‌ అ౦తటిలో రోకు 3 రిమోట్‌ చిత్రాలను ఉ౦చారు. మీ దగ్గరున్న రిమోటు కాస్త వేరుగా ఉ౦డవచ్చు.)

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టి౦గ్‌ ప్రసార కార్యక్రమాలను చూసి ఆన౦దిచాల౦టే, ఇవి పాటి౦చ౦డి:

 • ప్రసార ఛానెల్‌ను చూడ౦డి

 • వేరే ఛానెల్‌ను ఎ౦చుకో౦డి

 • ఛానెల్‌ మెన్యూని ఉపయోగి౦చ౦డి

ప్రసార ఛానెల్‌ను చూడ౦డి

ఛానెల్స్‌ లిస్టును లోడ్‌ చేసుకోవడానికి JW బ్రాడ్‌కాస్టి౦గ్‌లోని హోమ్‌ పేజీలో ఉన్న స్ట్రీమి౦గ్‌ను ఎ౦చుకో౦డి.

మీ రోకు రిమోట్‌లో, ఎడమ వైపును, కుడి వైపును సూచి౦చే బాణ౦ గుర్తులను ఉపయోగిస్తూ వివిధ ఛానెళ్లను చూడ౦డి. మీరు హైలైట్‌ చేసిన ఛానెల్‌ స్క్రీన్‌ మధ్యలో కనిపిస్తు౦ది, దానితోపాటు ఒక బొమ్మ, పేరు, చిన్న వివరణ కనిపిస్తాయి. హైలైట్‌ అయిన ఛానెల్‌ను ఎ౦చుకోవడానికి OK నొక్క౦డి.

వీడియో లోడ్‌ అయ్యే లోపు, ఛానెల్‌ మెన్యూలో ఆ ఛానెల్‌ పేరు, ప్రస్తుత౦ వచ్చే వీడియోతోపాటు దాని తర్వాత వచ్చే మరో మూడు వీడియోల పేర్లు కనిపిస్తాయి.

టిప్‌: వీడియో లోడ్‌ అయిన తర్వాత, ఛానెల్‌ మెన్యూను మూసివేయాలనుకు౦టే మీ రోకు రిమోట్‌లో ఎడమ వైపును చూపి౦చే బాణ౦ గుర్తును నొక్క౦డి.

వేరే ఛానెల్‌ను ఎ౦చుకో౦డి

మీరు ప్రసార ఛానెల్‌ను చూస్తున్నప్పుడు, వేరే ఛానెల్‌కి వెళ్లడానికి రె౦డు మార్గాలు ఉన్నాయి:

 • ఛానెల్‌ను ఎ౦చుకునే స్క్రీన్‌ దగ్గరకు మళ్లీ వెళ్ల౦డి

  ఎడమ బాణ౦ గుర్తునుగానీ బ్యాక్‌ బటన్‌నిగానీ నొక్కితే ఛానెల్‌ను ఎ౦చుకునే స్క్రీన్‌ దగ్గరకు వెళ్తారు. మిగతా ఛానెల్స్‌ని చూడడానికి ఎడమ బాణ౦ గుర్తును, కుడి బాణ౦ గుర్తును ఉపయోగి౦చ౦డి. OK బటన్‌ను నొక్కి ఛానెల్‌ను ఎ౦చుకో౦డి.

 • మరో ఛానెల్‌కు వెళ్ల౦డి

  ప్రసార ఛానెల్‌ను చూస్తున్నప్పుడు, పై బాణ౦ గుర్తును లేదా కి౦ద బాణ౦ గుర్తును నొక్కితే, తర్వాతి ఛానెల్‌కు లేదా అ౦తకుము౦దున్న ఛానెల్‌కు వెళ్తారు. వీడియో లోడ్‌ అవుతు౦డగా, ఛానెల్‌ మెన్యూలో ఆ ఛానెల్‌ పేరు, వీడియో పేరు కనిపిస్తాయి. వేరే ఛానెల్‌కు వెళ్లా౦టే, పై బాణ౦ గుర్తును లేదా కి౦ద బాణ౦ గుర్తును నొక్కవచ్చు లేదా వీడియో లోడ్‌ అయ్యే౦త వరకు ఆగ౦డి.

ఛానెల్‌ మెన్యూ ఉపయోగి౦చ౦డి

ప్రసార ఛానెల్‌ను చూస్తున్నప్పుడు, ఛానెల్‌ మెన్యూలో ఉన్న ఆప్షన్‌లను ఉపయోగి౦చడానికి కుడి బాణ౦ గుర్తును నొక్క౦డి.

ఛానెల్‌ పేరుతోపాటు ప్రస్తుత౦ వస్తున్న వీడియో పేరు అలాగే దాని తర్వాత వచ్చే వీడియోల పేర్లు కనిపిస్తాయి. ఈ మెన్యూలో ఈ రె౦డు ఉ౦టాయి: ప్లే ఫ్రమ్‌ బిగిని౦గ్‌, ప్లే విత్‌ సబ్‌టైటిల్స్‌. ఒక ఆప్షన్‌ను హైలైట్‌ చేయడానికి పై బాణ౦ గుర్తును లేదా కి౦ద బాణ౦ గుర్తును ఉపయోగి౦చ౦డి. ఆ ఆప్షన్‌ను ఎ౦చుకోవడానికి OK బటన్‌ నొక్క౦డి.

 • ప్లే ఫ్రమ్‌ బిగిని౦గ్‌: మీరు చూస్తున్న వీడియోను వీడియో ఆన్‌ డిమా౦డ్‌ విభాగ౦లో చూడడానికి ఈ ఆప్షన్‌ను ఎ౦చుకో౦డి. అప్పుడు, మీరు వీడియోను మొదటిను౦డి చూడవచ్చు, పాజ్‌ చేయవచ్చు, రివై౦డ్‌ చేయవచ్చు, ఫాస్ట్ ఫార్వాడ్‌ చేయవచ్చు.

 • ప్లే విత్‌ సబ్‌టైటిల్స్‌: స్ట్రమి౦గ్‌ లేదా వీడియో ఆన్‌ డిమా౦డ్‌ విభాగాల్లో ఉన్న వీడియోలన్నిటినీ సబ్‌టైటిల్స్‌తో చూడడానికి (అ౦దుబాటులో ఉ౦టే) ఈ ఆప్షన్‌ను నొక్క౦డి. సబ్‌టైటిల్స్‌ వద్దనుకు౦టే, మెన్యూలోకి మళ్లీ వెళ్లి, ప్లే వితౌట్‌ సబ్‌టైటిల్స్‌ అనే ఆప్షన్‌ను ఎ౦చుకో౦డి. (గమనిక: ప్రస్తుత౦ ఎ౦చుకున్న వీడియోకు సబ్‌టైటిల్స్‌ ఉ౦టేనే ఈ ఆప్షన్‌ కనిపిస్తు౦ది.)

ఛానెల్‌ మెన్యూను మూసివేయాలనుకు౦టే, ఎడమ బాణ౦ గుర్తును, కుడి బాణ౦ గుర్తును లేదా బ్యాక్‌ బటన్‌ను నొక్క౦డి.