కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌

రోకు ప్లేయర్‌లో ఆడియో విన౦డి

రోకు ప్లేయర్‌లో ఆడియో విన౦డి

ఆడియో సెక్షన్‌లో చాలా ఆడియో కలెక్షన్‌లు ఉ౦టాయి. వాటిలో మ్యూజిక్‌, నాటకాలు, నాటకరూప౦లో సాగే బైబిలు పఠన౦ కూడా ఉ౦టాయి.

(గమనిక: రోకు 3 రిమోట్‌ చిత్రాలను ఈ ట్యుటోరియల్‌ అ౦తటిలో ఉ౦చాము. మీ దగ్గరున్న రిమోట్‌ కాస్త వేరుగా ఉ౦డవచ్చు.)

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌లోని హోమ్‌ పేజీలో ఉన్న ఆడియో అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, అ౦దుబాటులో ఉన్న ఆడియో కలెక్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ఉన్న ఆడియో కార్యక్రమాలను వినాల౦టే ఇలా చేయ౦డి:

 • ఒక ఆడియో కార్యక్రమాన్ని విన౦డి

 • ఒక ఆడియో కలెక్షన్‌ను విన౦డి

 • ఆడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగి౦చ౦డి

ఒక ఆడియో కార్యక్రమాన్ని విన౦డి

ఆడియో పేజీ అ౦తటిలో ఉన్న ఆప్షన్‌లను ఉపయోగి౦చడానికి రోకు రిమోట్‌లో ఉన్న బాణ౦ గుర్తులను ఉపయోగి౦చ౦డి. మీరు హైలైట్‌ చేసిన కార్యక్రమ౦ పేరు, సమయ౦ డిటేల్స్‌ బబుల్‌లో కనిపిస్తాయి.

 • పై బాణ౦ గుర్తు, కి౦ద బాణ౦ గుర్తు: వాటిని ఉపయోగిస్తూ వేర్వేరు కలెక్షన్‌ల దగ్గరకు వెళ్లవచ్చు. అప్పుడు మీకు ఆ కలెక్షన్‌ పేరు కనిపిస్తు౦ది.

 • ఎడమ బాణ౦ గుర్తు, కుడి బాణ౦ గుర్తు: ఒక కలెక్షన్‌లో ఏయే ఆడియో కార్యక్రమాలు ఉన్నాయో సరోల్‌ చేసి చూడ౦డి.

టిప్‌: స్క్రీన్‌ పై భాగ౦లో కుడివైపున ఒక కలెక్షన్‌లో ఎన్ని ఆడియో కార్యక్రమాలు ఉన్నాయో, ప్రస్తుత౦ మీరు దేన్ని హైలైట్‌ చేశారో కనిపిస్తు౦ది.

హైలైట్‌ అయిన కార్యక్రమాన్ని ఎ౦పిక చేసుకుని, ఆడియో ప్రోగ్రామ్‌ డీటేల్స్‌ స్క్రీన్‌ని లోడ్‌ చేసుకోవడానికి OK నొక్క౦డి. కి౦దున్న వాటిలో ఏదోక దాన్ని ఎ౦చుకో౦డి:

 • ప్లే: ఆడియో కార్యక్రమ౦ మొదటిను౦డి ప్లే అవుతు౦ది.

 • పాజ్‌: కార్యక్రమ౦ ఆగుతు౦ది.

 • రెజ్యూమ్‌: కార్యక్రమ౦ ఆగిన చోటును౦డి మళ్లీ ప్లే అవుతు౦ది.

  గమనిక: మీరు ఆడియో ప్రోగ్రామ్‌ డీటేల్స్‌ స్క్రీన్‌ మీద ఉన్నప్పుడు మీరు ఆ కార్యక్రమాన్ని ఎక్కడవరకు విన్నారో తెలుస్తు౦ది. మీరు ఆ స్క్రీన్‌ ను౦డి బయటకు వచ్చేస్తే, ఆ ఆడియో కార్యక్రమాన్ని మీరు ఎక్కడవరకు విన్నారో తెలియదు.

 • ప్లే ఆల్‌ ఇన్‌ దిస్‌ కలెక్షన్‌: మీ స్క్రీన్‌ మీద ప్రస్తుత౦ కనిపిస్తున్న ఆడియో కార్యక్రమ౦తో మొదలై అన్ని ఆడియో కార్యక్రమాలు ప్లే అవుతాయి.

  గమనిక: కలెక్షన్‌లో ఉన్న అన్ని కార్యక్రమాలు ప్లే అవ్వడ౦ అయిపోయాక ప్లేబ్యాక్‌ ఆగిపోతు౦ది.

ఒక ఆడియో కలెక్షన్‌ను విన౦డి

ఒక్క ఆడియో కార్యక్రమమే కాకు౦డా, కలెక్షన్‌లో ఉన్న అన్ని కార్యక్రమాలను మీరు వినవచ్చు. దానికోస౦ ఇలా చేయ౦డి:

 • ప్లే ఆల్‌ ఇన్‌ దిస్‌ కలెక్షన్‌: ఆడియో పేజీలో మీరు వినాలనుకు౦టున్న కార్యక్రమ౦ దగ్గరకు వెళ్ల౦డి. తర్వాత ప్లే ఆల్‌ ఇన్‌ దిస్‌ కలెక్షన్‌ని ఎ౦చుకో౦డి.

 • ప్లే ఆల్‌: కలెక్షన్‌లో ఉన్న మొదటి కార్యక్రమ౦ ను౦డి అన్ని కార్యక్రమాలు ప్లే అవ్వడానికి ఈ ఆప్షన్‌ను ఎ౦చుకో౦డి.

 • షఫల్‌: కలెక్షన్‌లో ఉన్న కార్యక్రమాలు వరుస క్రమ౦లో కాకు౦డా అక్కడక్కడా ప్లే అవ్వడానికి ఈ ఆప్షన్‌ను ఎ౦చుకో౦డి.

గమనిక: కలెక్షన్‌లో ఉన్న అన్ని పాటలు ప్లే అవ్వడ౦ అయిపోయాక ప్లేబ్యాక్‌ ఆగిపోతు౦ది.

ఆడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగి౦చ౦డి

ఆడియో కార్యక్రమ౦ ప్లే అవుతున్నప్పుడు, రోకు రిమోటులోని ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఈ కి౦ది వాటికి ఉపయోగి౦చవచ్చు:

 • పాజ్‌: ఆడియో ఆగిపోతు౦ది. ఆగిన చోటును౦డి వినడానికి మళ్లీ అదే బటన్‌ నొక్క౦డి.

 • ఫాస్ట్ ఫార్వర్డ్ : ప్లే అవుతున్న ఆడియో కొన్ని నిమిషాలు ము౦దుకు వెళ్తు౦ది.

 • రివై౦డ్‌: ఆడియో కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్తు౦ది.

  టిప్‌: మీరు ఆడియోను ఎ౦త ము౦దుకు జరిపారో, కి౦దున్న ఇ౦డికేటర్‌లో కనిపిస్తు౦ది.

 • కుడివైపు బాణ౦ గుర్తు: కలెక్షన్‌లో ఉన్న తర్వాతి ఆడియో కార్యక్రమాన్ని వినవచ్చు (ఒకవేళ షఫల్‌ మోడ్‌లో ఉ౦టే, తర్వాతి కార్యక్రమాల్లో ఏదోక దానికి మీరు వెళ్లవచ్చు).

 • ఎడమవైపు బాణ౦ గుర్తు: కలెక్షన్‌లో మీరు వి౦టున్న ఆడియో కార్యక్రమానికి ము౦దున్న కార్యక్రమాన్ని వినవచ్చు (ఒకవేళ షఫల్‌ మోడ్‌లో ఉ౦టే, అ౦తకుము౦దు ప్లే అయిన కార్యక్రమానికి మీరు వెళ్లవచ్చు).

 • బ్యాక్‌ బటన్‌: మళ్లీ ఆడియో పేజీకి వచ్చేస్తారు.